: ఆ ముగ్గుర్నీ అనర్హులుగా ప్రకటించండి: టీడీఎల్పీ
తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ అయి టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలపై టీటీడీపీ నేతలు మండిపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్యవినిమయ బిల్లును వ్యతిరేకించాలని విప్ జారీ చేసినా ఈ ముగ్గురూ బేఖాతరు చేశారని టీడీఎల్పీ విమర్శించింది. విప్ జారీ చేసినా సభ నుంచి వాకౌట్ చేయని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు వీరు ముగ్గుర్నీ అనర్హులుగా ప్రకటించాలని ఇవాళ లిఖిత పూర్వకంగా స్పీకర్ కు ఫిర్యాదు చేయనుంది టీడీఎల్పీ.