: రైలు ఢీకొని పెద్దపులి మృతి


వేగంగా వస్తున్న రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందిన ఘటన నైనిటాల్ జిల్లా రాంనగర్ సమీపంలో జరిగింది. నేటి ఉదయం హేంపూర్ ఆర్మీ డిపో దగ్గరలోని రైల్వే ట్రాక్ పై తల తెగిపడ్డ పెద్దపులిని కనుగొన్నామని కార్బెట్ టైగర్ రిజర్వు డిప్యూటీ డైరెక్టర్ సాకేత్ బడోలా తెలిపారు. ఏ ట్రైన్ ఢీకొన్నదో తెలియదని వివరించారు. సాధారణంగా రైళ్ళు ఢీకొని ఏనుగులు అధికంగా మరణిస్తుంటాయి. పెద్దపులులు రైళ్లకు ఎదురు నిలవటం చాలా అరుదు. దీంతో మరణించిన పులిని చూసేందుకు సమీప ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.

  • Loading...

More Telugu News