: రోబోలు ఎగురుతాయి... కోరిన వంటకాలు సర్వ్ చేస్తాయి!


టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కిస్తూ సింగపూర్ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణకు తెరదీశారు. ఇన్ఫీనియమ్ రోబోటిక్స్ సంస్థ నెక్స్ట్ జనరేషన్ రోబోలకు రూపకల్పన చేసింది. ఈ రోబోలు ఎగిరే సామర్థ్యం ఉన్నవి కావడం విశేషం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, వీటిని రెస్టారెంట్లలో వినియోగించనున్నారు. అంటే, వెయిటర్లుగా సేవలందిస్తాయన్నమాట. వచ్చే ఏడాది చివరికల్లా ఈ ఎగిరే రోబోలు రంగప్రవేశం చేస్తాయి. తొలుత వీటిని సింగపూర్లోని టింబర్ గ్రూప్ కు చెందిన ఐదు ఔట్ లెట్లలో ప్రవేశపెడతారు. ఈ మేరకు ఇన్ఫీనియమ్ రోబోటిక్స్ సంస్థ టింబర్ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ లో కార్మికుల కొరతను ఈ రోబోల ద్వారా అధిగమించవచ్చని ఇన్ఫీనియమ్ రోబోటిక్స్ సంస్థ సీఈఓ వూన్ జున్యోంగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ తరహా రోబోలను అక్టోబర్ మొదటి వారంలో సింగపూర్ ప్రధాని లీ సియెన్ లూంగ్ ఎదుట ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News