: 36 మంది భారత ఖైదీలను విడుదల చేసిన పాక్
కరాచీ జిల్లాలోని మలీర్ జైలు నుంచి 36 మంది భారత్ ఖైదీలను పాకిస్థాన్ అధికారులు విడుదల చేశారు. వారిలో 35 మంది జాలర్లు కాగా, మరొకరు శిక్ష పూర్తి చేసుకున్న పౌరుడు. ఈ విషయాన్ని 'డాన్' ఆన్ లైన్ పత్రిక తెలిపింది. విడుదలయిన ఖైదీలను లాహోర్ దగ్గరలోని వాఘా సరిహద్దు నుంచి భారత్ కు చేర్చనున్నారు.