: నా బంతి అంత పని చేసిందా?: కోలుకోలేకపోతున్న సీన్ అబాట్


ఆటలో భాగంగా తాను వేసిన బంతి తనకెంతో ఇష్టమైన ప్లేయర్ మరణానికి కారణం కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు సీన్ అబాట్. న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడుతున్న అబాట్ విసిరిన బంతి, మెడ కండరాలపై తగిలి ఫిలిప్ హ్యూస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ వార్త విన్న తరువాత అబాట్ తీవ్ర వేదనలో మునిగిపోయాడు. ఈ దురదృష్టకర సంఘటన అబాట్ క్రికెట్ జీవితాన్ని కూడా ఓ మలుపు తిప్పిందని మాజీ టెస్ట్ క్రికెటర్ జాసన్ గిలెస్పీ అన్నాడు. అబాట్ తప్పేమీ లేకపోయినా, జీవితాంతం ఈ ఘటన మనసును తొలిచేదేనని, బౌన్సర్ వేయాలనుకున్న ప్రతిసారీ అబాట్ కు హ్యూస్ గుర్తొస్తాడని చెప్పాడు. ఈ ఘటన అబాట్ ను దీర్ఘకాలం పాటు వెంటాడుతుందని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News