: అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం
ఈ ఉదయం అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. పోర్ట్ బ్లెయిర్ కు 94 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లినట్టు వార్తలు రాలేదు.