: 'మేడిన్ ఏపీ'లో భాగస్వాములవుతాం: వాహన తయారీ సంస్థ 'ఇసుజు'


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ పర్యటన ఫలితాలనిస్తోంది. పారిశ్రామికవేత్తలతో ఆయన చేపడుతున్న చర్చలు ఫలవంతమవుతున్నాయి. ఈ క్రమంలో, ప్రపంచ అగ్రగామి వాహన తయారీ సంస్థల్లో ఒకటైన ఇసుజు కూడా ఏపీలో తమ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. తాము ఒక యూనిట్ నెలకొల్పితే దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు వస్తాయని చెప్పింది. స్వయంగా ముఖ్యమంత్రే వచ్చి ఆహ్వానం పలికినందున ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. తాము కూడా మేడిన్ ఏపీలో భాగస్వాములవుతామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమకు 10 ట్రక్కు తయారీ సంస్థలు ఉన్నాయని... మరొకదాన్ని ఏపీలో నిర్మిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News