: విద్యార్థినులను వేధిస్తుండగా వారించాడని... అధ్యాపకుడిపై దాడి


విద్యావ్యవస్థలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాఠశాలల్లోను, కళాశాలల్లోనూ విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తున్నారని విరుచుకుపడే విద్యార్థి సంఘాలు, హక్కుల సంఘాలు సమాధానం చెప్పాల్సిన సంఘటన అన్నవరంలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవ జూనియర్ కళాశాల అధ్యాపకుడిపై విద్యార్థులు దాడిచేశారు. విద్యార్థినులను వేధిస్తుండగా, కళాశాల అధ్యాపకుడు విద్యార్థులను మందలించాడు. దీంతో తమ అనుచరులతో వచ్చిన సదరు విద్యార్థులు అధ్యాపకుడిపై దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News