: నితిన్, అఖిల్ మంచి ఫ్రెండ్స్: నాగార్జున


నితిన్ కి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యింది సినిమాలు పెద్ద హిట్ లుగా నిలిచాయని, చిన్నదాన నీ కోసం సినిమా ఆ రెండు సినిమాలను మించి హిట్టవ్వాలని నాగార్జున ఆకాంక్షించారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, తాను మంచి స్నేహితులమని తెలిపిన నాగార్జున... నితిన్, అఖిల్ మంచి స్నేహితులని అన్నారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరితో తనకు మంచి అనుబంధముందని నాగ్ వెల్లడించారు. దర్శకుడు కరుణాకరన్ కు కాస్త తిక్క ఉందని, దానిని సరి చేసుకుంటే అద్భుతమైన దర్శకుడవుతాడని ఆయన సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ పాటను ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News