: నగ్నంగా ఫోటో తీశారని యువతి... ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆసుపత్రి... పరస్పర ఆరోపణలు


నగ్నంగా ఫోటో తీశారంటూ ఓ యువతి ఆరోపిస్తుండగా, డబ్బు కోసం ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఈసీఐఎల్లోని జినియా ఆసుపత్రి యజమాని తనను నగ్నంగా ఫోటో తీశారని, తన నగ్నదేహాన్ని చిత్రీకరించినందుకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఓ యువతి డిమాండ్ చేస్తుండడంతో, ఆసుపత్రి యజమాని పోలీసులను ఆశ్రయించాడు. తనను బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News