: పర్యాటకుల జోలికి వెళితే జైలే గతి!


ఉత్తరప్రదేశ్ లో పర్యాటకుల భద్రతకు కేంద్రం మెరుగైన చర్యలు తీసుకుంటోంది. ఇకపై, యూపీలో పర్యాటకులను వేధిస్తే జైలుపాలవక తప్పదని కేంద్ర టూరిజం, కల్చర్ శాఖ మంత్రి మహేశ్ శర్మ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ, టూరిస్టులను వేధింపులకు గురిచేయడాన్ని నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపారు. ఇటీవల కాలంలో ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద మహిళా పర్యాటకులపై కొన్ని అభ్యంతరకర ఘటనలు చోటుచేసుకున్నాయి. గతకొంతకాలంగా ఈ చారిత్రక ప్రదేశానికి వచ్చే టూరిస్టుల సంఖ్య క్రమేపీ పడిపోసాగింది. దీనిపై, లైసెన్స్ డ్ గైడ్ల సంఘం అధ్యక్షుడు సంజయ్ శర్మ మాట్లాడుతూ, గతేడాది నుంచి 10 శాతం మేర టూరిస్టులు తగ్గిపోయారన్నారు. వేధింపుల కారణంగానే ఇలా జరుగుతోందని మంత్రి చెబుతున్నారని శర్మ తెలిపారు. కాగా, తాజ్ మహల్ ను సందర్శించే వారిలో అత్యధికులు తాము దళారీలు, గైడ్లు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల చేతిలో మోసపోయామనో, వేధింపులకు గురయ్యామనో భావిస్తున్నారట.

  • Loading...

More Telugu News