: జర్మన్ భాషను ఓ 'హాబీ'గా చదువుకోవచ్చు: కేంద్ర ప్రభుత్వం
జర్మన్ భాషను కేవలం ఓ హాబీగా చదువుకోవచ్చని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అటు, జర్మన్ ను మూడో భాషగా తొలగించాలన్న తన నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంది. ప్రస్తుతం దేశంలోని వెయ్యి కేంద్రీయ విద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో జర్మన్ ను మూడో భాషగా నేర్పుతున్నారు. జర్మన్ ను మూడో భాషగా తొలగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల సదరు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంలో పిటిషన్ వేశారు. అయితే, ఈ నెల మొదట్లో జర్మన్ భాషపై కేంద్ర విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు జర్మన్ ను మూడో భాషగా తప్పక చదివించాల్సినంత అవసరంలేదని పేర్కొన్నారు.