: భూ కేటాయింపుల్లో అక్రమాలపై కమిటీల ఏర్పాటుకు ఇబ్బంది లేదు: కేసీఆర్


హైదరాబాదులో భూ కేటాయింపుల్లో చోటుచేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చేందుకు వక్ఫ్ భూములకు ఒకటి, సొసైటీ భూములకు మరో కమిటీని వేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం కేసీఆర్ అన్నారు. అక్బరుద్దీన్ వాదనకు స్పందించిన సీఎం ఈ మేరకు ప్రకటించారు. అంతేగాక, ఆయా కమిటీల్లో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన స్పీకర్ ను కోరారు. బంజారా హిల్స్ లో బంజారా సామాజిక వర్గాలకు రెండు బంజారా భవనాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. లంబాడాలకు, ఆదీవాసీలకు ఈ భవనాలను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇందుకోసం రెండు ఎకరాల భూమిని కేటాయిస్తామన్నారు.

  • Loading...

More Telugu News