: నల్ల శాలువాలతో లోక్ సభలో తృణమూల్ సభ్యుల నిరసన


నల్లధనంపై తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు లోక్ సభలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు నల్ల గొడుగులతో ఆందోళన వ్యక్తం చేసిన సభ్యులు, ఈ రోజు నల్ల శాలువాలు కప్పుకుని వచ్చి తమ నిరసన తెలిపారు. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే నల్ల శాలువాలు ధరించిన తృణమూల్ సభ్యులు సభలోకి ప్రవేశించారు. 'నల్లధనం వెనక్కి తీసుకురావాలి' అంటూ నినాదాలు చేస్తూ వారి సీట్లలోకి వెళ్లారు. అయితే, గత రెండు రోజుల మాదిరిగా కాకుండా, నేడు సభ సమావేశాలకు వారు ఇబ్బంది కలిగించలేదు.

  • Loading...

More Telugu News