: క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతి... క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి


సిడ్నీలో దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా ఫాస్ట్ బౌలర్ షాన్ అబాట్ వేసిన ఓ బౌన్సర్ బలంగా తాకడంతో గత కొన్ని రోజులుగా కోమాలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ (25) నేటి ఉదయం మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఫిల్ హ్యూస్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. హ్యూస్ మృతితో క్రికెట్ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆస్టేలియా తరపున ఫిల్ హ్యూస్‌ 26 టెస్టులు, 25 వన్డేలు, ఒక ట్వంటీ 20 మ్యాచ్ ఆడాడు. డిసెంబర్ 4 నుంచి ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్ పిలుపు కోసం వేచిచూస్తున్న తరుణంలో ఈ దుర్ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News