: టీచర్ వేధింపులు తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న 8వ తరగతి విద్యార్థి


టీచర్ తనను నిత్యం వేధిస్తున్నారంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడో విద్యార్థి. ఫరీదాబాద్ లోని హోలీ చైల్డ్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. స్కూల్ లోని ఓ టీచర్ రోజూ వేధించటమే కాకుండా అందరిముందూ హేళన చేస్తున్నారని 8వ తరగతి విద్యార్థి బాత్ రూంలోకి వెళ్లి తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. బాలుడి శరీరం 40 శాతానికి పైగా కాలడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. బాలుడి స్టేట్ మెంట్ తీసుకున్న పోలీసులు, అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News