: పైన బొప్పాయి పండ్లు... కింద ఎర్రచందనం దుంగలు!
అది పైకి చూడటానికి బొప్పాయి పండ్ల లోడ్ తో వెళ్తున్న లారీలా కనిపిస్తుంది. కానీ, రవాణా చేస్తున్నది మాత్రం ఎర్రచందనం దుంగలను. ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం తాటచర్ల మోటు రహదారిపై నేటి ఉదయం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. బొప్పాయి లోడ్‌తో వెళ్తున్న లారీని పోలీసులు ఆపి, డ్రైవర్‌ను ప్రశ్నించగా, పొంతన లేని సమాధానాలు రావడంతో, సందేహించిన పోలీసులు లారీలో తనిఖీలు నిర్వహించారు. బొప్పాయి పండ్ల కింద ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.