: మకావ్ ఓపెన్ లో ప్రీక్వార్టర్స్ కు దూసుకెళ్లిన సింధు
మకావ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగుతేజం పీవీ సింధు ప్ర్రీక్వార్టర్స్ కు దూసుకెళ్లింది. వరల్డ్ నెంబర్ 10 క్రీడాకారిణి సింధు నేడు జరిగిన మ్యాచ్ లో చైనీస్ తైపే క్రీడాకారిణి హంగ్ షీ హాన్ పై 21-19, 21-15తో నెగ్గింది. అటు, పురుషుల విభాగంలో, హెచ్ఎస్ ప్రణోయ్, బి.సాయిప్రణీత్ కూడా ప్రీక్వార్టర్స్ లోకి ప్రవేశించారు. ప్రణోయ్ 21-18, 21-16తో ఇండోనేసియా షట్లర్ ఆండ్రే మార్టీన్ ను చిత్తు చేయగా, 8వ సీడ్ ప్రణీత్ 21-15, 21-18తో సింగపూర్ క్రీడాకారుడు రోనాల్డ్ సుసిలోపై నెగ్గాడు.