: బొగ్గు గనిలో ప్రమాదం... 24 మంది సజీవ దహనం
చైనా ఈశాన్య ప్రాంతంలోని లియానింగ్ ప్రాంతంలోని బొగ్గు గనిలో మంటలు అంటుకోవడంతో 24 మంది సజీవ దహనం కాగా, మరో 52 మంది గాయపడ్డారు. మంటలు అంటుకోవడానికి ముందు ఆ ప్రాంతంలో స్వల్ప భూకంపం కూడా సంభవించింది. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. బొగ్గు గనుల నుంచి సమీప పట్టణం షెన్ యాంగ్ 200 కిలోమీటర్ల దూరం ఉండటంతో క్షతగాత్రులను తరలించేందుకు మూడు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 1.6గా నమోదుకాగా, ఆ వెంటనే గని లోపల మంటలు చెలరేగాయని చైనా న్యూస్ ఏజెన్సీ వివరించింది. ఈ ఘటనతో హెంగ్డా కోల్ సంస్థ తమ అన్ని గనులలో తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. గత సంవత్సరం ఇవే గనుల్లో గ్యాస్ లీక్ కాగా 8 మంది మరణించారు.