: చార్మినార్ చూడాలని రూ.65 వేలతో రైలెక్కాడు


ప్రకాశం జిల్లా కనిగిరిలో అదృశ్యమైన కార్తికేయ హైదరాబాద్ లో ప్రత్యక్షం అయ్యాడు. చార్మినార్ చూడాలన్న బలమైన కోరికతో ఇంట్లోని రూ.65 వేలను తస్కరించి మరీ రైలెక్కేశాడు. ఆ బాలుడు నాంపల్లి రైల్వేస్టేషన్లో తిరుగుతుండగా, రైల్వే పోలీసులు అనుమానంతో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. రైల్వే ఎస్ఐ ఇబ్రహీం ఈ విషయాన్ని కనిగిరి పోలీసులకు వివరించారు. నేటి ఉదయం హైదరాబాద్ చేరుకున్న కార్తికేయ తల్లిదండ్రులకు కుమారుడితో పాటు, నగదును అప్పగించారు.

  • Loading...

More Telugu News