: జహీరాబాద్ రైల్వే స్టేషన్ మాస్టర్ని, పోలీసుల్ని ఉతికేశాడు


మెదక్ జిల్లా జహీరాబాద్ రైల్వేస్టేషన్ లో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగమేశాడు. రైల్వే స్టేషన్ లోకి దూరిన వ్యక్తి స్టేషన్ మాస్టర్ రూంలోకి దూసుకెళ్లాడు. కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేశాడు. అతనిని ఆపేందుకు ప్రయత్నించిన స్టేషన్ మాస్టర్ పై దాడికి దిగాడు. ఇంతలో పోలీసులు వచ్చి అతనిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పూనకం వచ్చిన వాడిలా వారిపై దూకాడు. వారిని కూడా వదలకుండా దాడి చేశాడు. దీంతో స్టేషన్ లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎట్టకేలకు పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News