: ఫిల్ హ్యూజెస్ కుటుంబానికి అండగా ఉంటాం: టీమిండియా


ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూజెస్ కుటుంబానికి అండగా నిలుస్తామని, ఎలాంటి సహకారమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత క్రికెట్ జట్టు ప్రకటించింది. ఎన్నో ఆశలతో క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకుని మంచి ఫాంలో ఉండి, ఆసీస్ జట్టులో స్థానం సంపాదించుకుంటాడని భావిస్తున్న దశలో ఫిల్ హ్యూజెస్ గాయపడడం తమను ఆందోళనకు గురిచేసిందని టీమిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అతని ఆరోగ్య పరిస్థితిపై ఆసీస్ అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నామని టీమిండియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, షెఫీల్డ్ షీల్డ్ దేశవాళీ పోటీల్లో భాగంగా సిడ్నీలో మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా ఓ బౌలర్ విసిరిన బౌన్సర్ బలంగా తలకు తగలడంతో హ్యూజెస్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో, అతనిని హెలికాప్టర్లో సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ అతని ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో క్రికెట్ ప్రపంచం ఆందోళనలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News