: జార్ఖండ్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో భారీ పోలింగ్ నమోదు


ఉత్తరాదిన జార్ఖండ్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇందులో భాగంగా జార్ఖండ్ లో 13 నియోజకవర్గాల్లో, జమ్ముకాశ్మీర్ లో 15 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలో జార్ఖండ్ లో 61.92 శాతం పోలింగ్, జమ్ముకాశ్మీర్ లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు కమిషన్ వివరించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, పోలింగ్ శాతం ఇంకా పెరుగుతుందని అధికారులు అన్నారు.

  • Loading...

More Telugu News