: స్త్రీల పక్షాన పోరాడుతా: సానియా మీర్జా
హింస నిర్మూలనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్త్రీల పక్షాన పోరాడతానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ఐక్యరాజ్యసమితి సుహృద్భావ ప్రచారకర్తగా నియమితురాలైన నేపథ్యంలో ఆమె హైదరాబాదులో మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి తనకు అప్పగించిన బాధ్యతను శక్తిమేర నెరవేరుస్తానని చెప్పింది. సమాజంలో ఇంకా మహిళలపై వివక్ష కొనసాగుతోందని సానియా అభిప్రాయపడింది. దక్షిణాసియాలో ఐక్యరాజ్యసమితితో కలిసి సానియా మీర్జా పనిచేయనుంది.