: బుల్లెట్ ట్రైనెక్కిన చంద్రబాబు అండ్ కో
జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించారు. ఈ రైలులో బాబు క్యోటో నుంచి ఫుకువొకా వెళ్లారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు కూడా బాబుతో పాటు బుల్లెట్ ట్రైన్ ప్రయాణాన్ని ఆస్వాదించారు. కాగా, నేడు చంద్రబాబు ఎలక్ట్రానిక్ దిగ్గజం ప్యానాసోనిక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టబడులు పెట్టాల్సిందిగా ఆయన వారిని కోరారు. ఏపీలో గల అవకాశాలు, రాయితీలను బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరించారు.