: చోరీ కుదరక ఏటీఎంనే ఎత్తుకుపోయారు!
ఏటీఎం సెంటర్లో చోరీకి యత్నించిన దుండగులు అది కుదరకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ నే ఎత్తుకుపోయిన ఘటన దేశ రాజధానిలో జరిగింది. ఢిల్లీలోని నరెలా ప్రాంతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను ఎవరో ఎత్తుకుపోయినట్లు స్వీపర్ తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు తెలిపాడు. వారు వచ్చి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూద్దామనుకుంటే అవి కూడా లేవు. సాక్ష్యం దొరకకుండా దొంగలు సీసీటీవీ కెమెరాలను కూడా ఎత్తుకుపోయారు. అంతకుముందు, వారు ఆ ప్రాంతంలోని వీధిలైట్లను పగలగొట్టారని, ఏటీఎం కేంద్రానికి సరైన భద్రత కల్పించడంలో బ్యాంకు విఫలమైందని, కనీసం సెక్యూరిటీ గార్డ్ కూడా లేడని పోలీసులు తెలిపారు.