: ఎంపీగా ప్రమాణం చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి
టీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు లోక్ సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో మెదక్ పార్లమెంటు స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే ప్రభాకర్ రెడ్డితో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రమాణం చేయించారు.