: నిజంగా ప్రేమే ఉంటే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి: పొన్నం ప్రభాకర్


హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టాలనుకోవడం సరికాదని మాజీ ఎంపీ, టీకాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్టీఆర్ పుట్టి పెరిగిన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామానికి ఆయన పేరు పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ రోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబంపై చంద్రబాబుకు నిజంగా అంత ప్రేమ ఉంటే తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు.

  • Loading...

More Telugu News