: 'ముప్పైలోపు సెలెబ్రిటీ కుబేరుల' జాబితాలో తొలి స్థానంలో జస్టిన్ బీబర్


ఫొర్బ్స్ పత్రిక ప్రకటించిన 'ముప్పైలోపు సెలెబ్రిటీ కుబేరుల' జాబితాలో కెనడియన్ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ నెంబర్ వన్ గా నిలిచాడు. ఈ ఏడాది 80 మిలియన్ డాలర్ల ఆదాయంతో 20 ఏళ్ల ఈ పాప్యులర్ గాయకుడు తొలి స్థానంలో ఉన్నట్టు stuff.co.nz వెబ్ సైట్ తెలిపింది. లండన్ కు చెందిన ఆంగ్ల-ఐరిష్ పాప్ బాయ్ బ్యాండ్ 'వన్ డైరెక్షన్' 75 మిలియన్ డాలర్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. టేలర్ స్విఫ్ట్ 64 మిలియన్ డాలర్లు, బ్రూనో మార్స్ 60 మిలియన్ డాలర్లు, రిహన్నా 48 మిలియన్ డాలర్లతో మిగతా ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో నటులకంటే సంగీతకారులే బాగా డామినేట్ చేయగా, పది స్థానాలలో నటి జెన్నీఫర్ లారెన్స్ మాత్రమే నంబర్.7లో ఉంది.

  • Loading...

More Telugu News