: మోదీ అసోం పర్యటనకు ఉల్ఫా విఘాతం కలిగించవచ్చు: ఇంటెలిజెన్స్ నివేదిక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30న గౌహతిలో జరిగే రాష్ట్ర పోలీస్ అధిపతుల సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సమయంలో ఆయన పర్యటనకు నిషేధిత ఉల్ఫా సంస్థ విఘాతం కలిగించవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు ఇంటెలిజెన్స్ ఓ నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా, ఉల్ఫా కమాండర్ ఇన్ చీఫ్ పరేష్ బారువా నేతృత్వంలో తప్పనిసరిగా ప్రమాదం పొంచి ఉందని పేర్కొందట. ఈ క్రమంలో ఎప్పుడైనా ఆకస్మిక దాడులు చేసి తమ ఉనికిని చాటుకోవాలని చూస్తోందట. ఈ నేపథ్యంలో అసోం పోలీస్, ఇతర సెక్యూరిటీ సంస్థలు ఉల్ఫా దళం నుంచి దాడులను ఎదుర్కొనేందుకు, శాంతికి విఘాతం కలగకుండా ఉండేందుకు గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు సూచించాయి.