: లోక్ సభ 12 గంటలకు వాయిదా
నల్లధనంపై చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో లోక్ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే, ఉభయ సభల్లో విపక్షాలు నల్లధనంపై చర్చకు పట్టుబట్టాయి. విపక్షాల డిమాండ్లను తిరస్కరించిన లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్న విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.