: మరో కేసులో గాలికి బెయిల్... అయినా జైల్లోనే!
బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో రిమాండులో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ లభించింది. ఆయనతో పాటు మరో పదిమందికి కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా బెళకెరె ఓడ రేవు నుంచి ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్న కేసులో వీరందరికి బెయిల్ వచ్చింది. అయితే, మరో నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో ప్రస్తుతానికి గాలి విడుదలకారని సీబీఐ అధికారులు తెలిపారు.