: కోదండరామ్ ను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మరచిపోయింది: కిషన్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్ ను అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మరచిపోయిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యమాల అండతో అధికారంలోకి వచ్చిన పార్టీ... ఉద్యమ నేతను ఎలా మర్చిపోయిందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన వారిని, ఉస్మానియా విద్యార్థులను, ఉద్యోగ సంఘాల పాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ జతకట్టడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చెప్పారు. లక్షల కోట్లు మింగేసిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే ప్రజలు కనుమరుగు చేశారని తెలిపారు.