: ఎమ్మార్ కుంభకోణం కేసులో 96 కోట్ల ఆస్తులు అటాచ్
ఎమ్మార్ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 96 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ స్పష్టం చేసింది. ఎమ్మార్ కుంభకోణంపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ, ఆదాయపన్నుల శాఖలు కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు సీబీఐ పలు ఛార్జిషీట్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.