: విజయవాడలో రాత్రిపూట గస్తీతో నేరాలు తగ్గాయి: సీపీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో రాత్రిపూట గస్తీ పెంచడంతో నేరాల సంఖ్య తగ్గిందని పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వాణిజ్య సంస్థలు సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. లేని పక్షంలో 5 వేల నుంచి 10 వేల వరకు జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడలో నేరాల కట్టడికి మరిన్ని చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.