: సమ్మె మానకపోతే జూడాలపై కఠిన చర్యలు: కామినేని
జూనియర్ డాక్టర్లు చట్టవిరుద్ధంగా సమ్మెను సాగిస్తున్నారని, తక్షణం సమ్మెను విరమించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును జూడాలు గౌరవించాలని ఆయన సూచించారు. పేదలకు చౌకగా ఔషధాలను అందించేందుకు జనరిక్ మందుల షాపులను ప్రారంభిస్తామని తెలిపారు.