: సంయమనం పాటించేందుకు ప్రయత్నిస్తా: కేసీఆర్
తెలంగాణ శాసనసభా నాయకుడిగా సంయమనం పాటించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. భూకేటాయింపులపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ, తను మాట్లాడుతుంటే ముఖ్యమంత్రే అడ్డుతగులుతున్నారని, ఆయనకు సహనం, హుందాతనం ఉండాలని సూచించారు. భట్టి సూచనను పాటించేందుకు ట్రై చేస్తానని కేసీఆర్ అనడం సభలో నవ్వులను పూయించింది.