: నిధుల కోసం ప్రభుత్వ భూముల విక్రయం: కేసీఆర్


సంక్షేమ పథకాలకు అవసరమైన నిధుల కోసం నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు అమ్మాలని నిర్ణయించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పట్టణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, గృహ నిర్మాణం, మురికివాడల్లో వసతుల కల్పన తదితరాల కోసం కొత్త విధానం తీసుకొస్తామని ఆయన తెలిపారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల స్థితిగతులు మెరుగుపడాల్సి ఉందని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకం అమలు చేస్తామన్నారు. రోడ్ల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతను ఐదేళ్ల వరకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని అన్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, గజ్వేల్ పట్టణాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు నాలుగు లైన్ల రోడ్లను నిర్మిస్తామని ఎమ్మెల్యేలకు వివరించారు.

  • Loading...

More Telugu News