: మెరుగైన సీటింగ్ ఏర్పాటు చేయండి, సభకు వస్తాను: కరుణానిధి
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు డీఎంకే అధినేత కరుణానిధి బదులిచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు డీఎంకే అధినేత సరిగా హాజరుకావడం లేదంటూ పన్నీర్ సెల్వం ఇటీవలే వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ, సభలో మెరుగైన సీటింగ్ అమరిక ఏర్పాటు చేస్తే, తాను సభకు వస్తానని కరుణ సమాధానమిచ్చారు. సరైన సీటింగ్ అమరిక లేకుండా తాను సభకు హాజరు కాలేనని 2013లో ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి సమాచారం అందించానని, ఈ ఏడాది కూడా సర్కారుకు తెలిపానని కరుణ వివరించారు. అయినాగానీ, సర్కారు తన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పత్రిక 'మురసోలి'లో ఆయన ఈ విషయాలు తెలిపారు.