: సీఎం కేసీఆర్ ను కలసిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు కలిశారు. డిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అనుమతులు ఇస్తే ప్రాజెక్టు ఎత్తు పెంచుతారని, దానివల్ల పాలమూరు జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. అటు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.