: కేంద్రానికి రూ.83 వేల కోట్ల నష్టం
ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు (సెజ్) ఇచ్చిన భూమిలో 50 శాతం వరకు నిరుపయోగంగా ఉండటంతో 2007 నుంచి 2013 మధ్య కేంద్రానికి రూ.83 వేల కోట్ల ఆదాయ నష్టం సంభవించింది. దేశవ్యాప్తంగా సెజ్ లలో ఉపాధి అవకాశాలు సైతం ముందుగా ఊహించినట్టు మెరుగు పడలేదని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) పరిశీలనలో వెల్లడైంది. అవసరం లేకపోయినా చాలా కంపెనీలకు పన్ను రాయితీలను పొడిగించారని, కొన్ని చోట్ల తమకు ఇచ్చిన భూమిలో కొంత భాగాన్ని కంపెనీలు ఇతర అవసరాలకు వాడుకుంటున్నాయని కాగ్ నివేదికను ఇచ్చింది. కాగా, ఈ నివేదికను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.