: పరిటాల హత్యపై పునర్విచారణను పరిశీలిస్తున్నాం: చినరాజప్ప


రాష్ట్రంలో సంచలనం రేపిన పరిటాల రవి హత్యోదంతంపై పునర్విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో సోమవారం పర్యటించిన ఆయన పరిటాల ఘాట్ వద్ద దివంగత మాజీ మంత్రి రవికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పరిటాల రవి ఎదుగుదలను చూసి ఓర్వలేని శక్తులే ఆయనను హత్య చేశాయని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News