: ఎన్టీఆర్ పేరుపై మీరే ఏకాభిప్రాయానికి రండి: టీఆర్ఎస్, టీడీపీలతో రాజ్ నాథ్
శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు విషయంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం టీఆర్ఎస్, టీడీపీలకు షాకిచ్చారు. సమస్యను పరిష్కరిస్తారనుకున్న రాజ్ నాథ్ చేసిన ప్రతిపాదనతో ఆ రెండు పార్టీల ఎంపీలు అయోమయానికి గురయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఈ విషయాన్ని లేవనెత్తారు. టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో ఆయన పక్కనే కూర్చున్న టీడీపీ ఎంపీ తోట నరసింహం ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. దీంతో రాజ్ నాథ్ కలుగజేసుకున్నారు. "పక్కపక్కనే కూర్చున్నారు. వేర్వేరు అభిప్రాయాలు చెబుతున్నారు. ఆమాత్రం సమస్యను పరిష్కరించుకోలేరా? మీరే చర్చించుకుని ఏకాభిప్రాయానికి రండి" అంటూ ఆయన వారిద్దరికీ సూచించారు.