: నేడు ఒంగోలుకు జగన్ పయనం
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఒంగోలుకు పయనమవుతున్నారు. ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షకు వెళుతున్న ఆయన రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో బయలుదేరే జగన్, తొలుత గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ కృష్ణా జిల్లా నేతలతో కొద్దిసేపు భేటీ అవుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం చెప్పారు. అనంతరం గుంటూరు వెళ్లి, పార్టీ నేత అంబటి రాంబాబు ఇంటిలో అల్పాహారం తీసుకున్న తర్వాత నేరుగా ఒంగోలు బయలుదేరుతారు.