: విచారణ నిమిత్తం బాబా రాంపాల్ ను ఆశ్రమానికి తీసుకొచ్చిన పోలీసులు
హర్యానాలో వివాదాస్పద గురువు బాబా రాంపాల్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అల్లర్ల నేపథ్యంలో పోలీసులు ఆయనను బుధవారం అరెస్టు చేయగా, కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. తాజాగా, బాబా రాంపాల్ ను పోలీసులు విచారణ నిమిత్తం హిసార్ జిల్లాలోని బర్వాలా 'సత్ లోక్' ఆశ్రమానికి తీసుకువచ్చారు. ప్రత్యేక విచారణ బృందానికి సాయపడేందుకు బాబా రాంపాల్ ను ఇక్కడి తీసుకురావాల్సి వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, ఆదివారం జరిపిన సోదాల సందర్భంగా పోలీసులు ఆశ్రమంలో వందల కొద్దీ కర్రలను స్వాధీనం చేసుకున్నారు. గతవారం ఆశ్రమంలో బాబా అనుచరులకు, భద్రతా దళాలకు మధ్య పోరు సాగడం, ఆరుగురు మరణించడం తెలిసిందే. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు.