: జగన్ కేసులో పదకొండో ఛార్జిషీటు స్వీకరించిన న్యాయస్థానం
జగన్ అక్రమాస్తుల కేసులో పదకొండో ఛార్జీషీట్ ను సీబీఐ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇందూ గృహ నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ రూపొందించిన ఛార్జిషీటును కోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణ కోసం డిసెంబర్ 19న కోర్టుకు హాజరుకావాలని వైఎస్ జగన్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి మహంతి, ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జితేంద్ర వీర్వాణి, వీవీ కృష్ణప్రసాద్ లకు సమన్లు జారీ చేసింది.