: సమంతకు సమంత ముద్దొచ్చింది!
సినీ హీరోయిన్లు ఏం చేసినా ముద్దొచ్చేస్తుంటారు. అందుకే నిర్మాతలు హీరోయిన్లడిగే ఏ కోరికనూ కాదనలేరు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు సమంత ముద్దొచ్చింది. సమంతకు సమంత ముద్దు రావడమేంటనుకుంటున్నారా? మనం కొత్త బట్టలు వేసుకున్న తరువాత అద్దం ముందు నిలబడి ఒకటికి పది సార్లు చూసుకుని మురిసిపోతుంటాం కదా? అలాగే సమంతకు డిజైనర్ క్రెషా బజాజ్ డిజైన్ చేసిన బట్టలు అందాయి. వాటిని వేసి చూసుకున్న సమంత ముచ్చటపడిపోయి, ఫోటో షూట్ చేయించుకుని, కొత్త బట్టలతో ఉన్న ఫోటోలు అభిమానుల కోసం పోస్ట్ చేసింది. నలుపు, తెలుపు కాంబినేషన్ గౌనులో తనను తాను చూసుకున్న సమంత 'లవ్యూ బేబీ' అంటూ కితాబిచ్చుకుంది.