: ఇందిరాపార్క్ దగ్గర ఉద్రిక్తత
ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీతాల బకాయిలు చెల్లించాలంటూ ఐకేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన రావడం లేదంటూ, ఐకేపీ కార్యకర్తలు తెలంగాణ సచివాలయ ముట్టడికి బయల్దేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఐకేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని వారు పోలీసులను ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు వారిని అనుమతించకపోవడంతో వారు అక్కడే బైఠాయించారు. దీంతో ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.