: ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి దీక్ష విరమణ
హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద టి.టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్ష విరమించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు మోత్కుపల్లి దీక్షకు సుజనా సంఘీభావం ప్రకటించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్ కు పెట్టిన ఎన్టీఆర్ పేరు తొలగించాలంటూ తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానానికి నిరసనగా ఈ ఉదయం మోత్కుపల్లి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.