: శివసేన అధినేతను కలసిన రైల్వే మంత్రి


శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసంలో కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కలిశారు. మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, బీజేపీ తరపున మాజీ మిత్రపక్షమైన శివసేనతో సయోధ్య కుదుర్చుకునేందుకే ఈ భేటీ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో సేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, "ప్రభు మా మాజీ సహచరుడు. ఇప్పుడు రైల్వే మంత్రి కూడా. మహారాష్ట్ర, ముంబయి అభివృద్ధిపై ఉద్ధవ్, ప్రభు చర్చించారు. అయితే, వారిద్దరి మధ్య ఏవైనా అపార్థాలు ఉంటే, వారు కలిసినప్పుడు అవి సమసిపోతాయి. చాలాకాలం నుంచి ఉద్ధవ్ జీ స్వభావం గురించి తెలుసు. ఎవరిపైనా ఆయన ఎలాంటి పగ పెట్టుకోరు" అని మీడియాకు తెలిపారు. ఇటీవల చేపట్టిన కేంద్ర కేబినెట్ తొలి విస్తరణలో సురేశ్ మంత్రి పదవిని దక్కించుకున్నారు. అంతకంటే ముందే ఆయన శివసేకు రాజీనామా చేసి బీజేపీలో చేరి షాక్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News